© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

నిజామాబాద్: బాధ్యత మహిళలకు మరియు పిల్లలకు సహాయం మెరుగైన సేవలు అందిస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తుంది.. మహిళలకు మరియు పిల్లలకు అండగా భరోసా కేంద్రం : పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మహిళలకు మరియు పిల్లలకు అండగా భరోసా కేంద్రం: పోలీస్ కమిషనర్ వెల్లడి... భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి, బాధితుల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. బాధిత మహిళలకు మరియు పిల్లలకు సహయం మెరుగైన సేవలు అందిస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తుంది. ఇందులో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కార్యాలయం యందు భరోసా కేంద్రంలో నమోదైన పోక్సో మరియు రేప్ కేసులలో ఏడు మంది బాధిత పిల్లలకు మరియు మహిళలకు భరోసా కేంద్రంతరపున చెక్కులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మనో-ధైర్యం, న్యాయం అందించడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి. నేడు బాధిత మహిళలకు మరియు పిల్లలకు ఆర్ధిక సాయం కోసం భరోసా కేంద్రం తరపున చెక్కులు అందజేయడం ద్వారా వారి పునర్వాసానికి మనదైన తోడ్పాటు అందించినందుకు సంతృప్తిగా ఉంది. ప్రతీ మహిళాలు మరియు పిల్లలు భద్రతగా, గౌరవంగా జీవించాలన్నదే మా అభిలాష భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి, బాధితుల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం అని తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, భరోసా సెంటర్ కో-ఆర్డినేటర్ జి. రోజా, లీగల్ అడ్వయిజర్ డయాణ గీతిక మహిళా పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పుష్పావతి మరియు మౌనిక, సవిత, ఎ.ఎన్.ఎమ్లు తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్ • సుమారు 2 నెలల క్రితం20

నిజామాబాద్ • 6 నెలల క్రితం35

నిజామాబాద్ • 4 నెలల క్రితం19

నిజామాబాద్ • ఒక రోజు క్రితం13

నిజామాబాద్ • 8 నెలల క్రితం27