ఘనంగా పసుపు బాలాజీ 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ఘనంగా కుకునూర్ పసుపు బాలాజీ 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు..
నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలంలోని కుకునూర్ (పసుపు బాలాజీ) దేవస్థానంలో జరుగుతున్న 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు...
కుకునూర్ పసుపు బాలాజీ బ్రహ్మోత్సవ విశేషాలు మాజీ మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం నాటి వేడుకల్లో పాల్గొన్నారు.వారికి మంగళ వాయిద్యాలతో గ్రామం ఘనస్వాగతం పలికింది.శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం మరియు రథోత్సవం.ఎమ్మెల్యే స్వయంగా కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) చైర్మన్ ర్యాడ మల్లేష్, ఏర్గట్ల నరేష్ మరియు కమిటీ సభ్యులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి ఉత్సవాన్ని విజయవంతం చేశారు.స్వర్ణ నంది అవార్డు గ్రహీత ప్రశాంతాచర్యులు బృందం మరియు గ్రామ వైదిక పురోహితులు వేద మంత్రోచ్ఛారణలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,కుకునూర్ పసుపు బాలాజీ దేవాలయానికి ఉన్న విశిష్టతను కొనియాడారు. భక్తుల కోసం మెరుగైన ఏర్పాట్లు చేసిన విడిసి కమిటీని మరియు ఉత్సవంలో పాల్గొన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో మోర్తాడ్ పాపాయి పవన్, నడుకూడ మాజీ సర్పంచ్ గంగారెడ్డి,సురేష్,రాజశేఖర్ గౌడ్, సర్పంచ్ లతిష భూమరెడ్డి,దేవేందర్ రెడ్డి తదితర నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.