© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
నిజామాబాద్: ఆర్మూర్ నియోజకవర్గంలో సాకారం అవుతున్న పేదల సొంత ఇంటి కల: 3,500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు... ఎస్ ఆర్ ఎస్ న్యూస్ ఆర్మూర్... ఆర్మూర్,"సొంతిల్లు ప్రతి పేదవాడి జీవితకాల స్వప్నం..ఆత్మగౌరవ చిహ్నం"అనే నినాదంతో ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్మూర్ నియోజకవర్గానికి మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇండ్లు వేగంగా రూపుదాల్చుకుంటూ, లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయి.ఆర్మూర్ పట్టణం జిరాయత్ నగర్ 14వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ గొనె లహరి రఘు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ శుభకార్యంలో వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డి,స్థానిక కౌన్సిలర్ సోను,ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.వీరితో పాటు కౌన్సిలర్లు భూపేందర్,శాల ప్రసాద్, విజయ్,మాజీ DCCB డైరెక్టర్ వాసు,పట్టణ నాయకులు జిమ్మి రవి,అజ్జు భాయ్,దామోదర్, సంతోష్,చిట్టి తదితరులు పాల్గొని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ గూడు కల్పించడమే లక్ష్యంగా,రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మిస్తున్న ఈ ఇళ్లు ఆర్మూర్ అభివృద్ధికి నిదర్శనమని వారు కొనియాడారు.

నిజామాబాద్ • 6 నెలల క్రితం20
నిజామాబాద్ • సుమారు 17 గంటల క్రితం1

నిజామాబాద్ • 8 నెలల క్రితం36
నిజామాబాద్ • 20 రోజుల క్రితం23

నిజామాబాద్ • 2 నెలల క్రితం16