© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

నిజామాబాద్: తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు నుండి ఆర్మూర్ పట్టణం వరకు జరిగిన పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాదయాత్రలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు రాజకీయ అధికారం కల్పించడం లో తెలంగాణ దేశంలో నే ఒక నమూన అన్నారు.4 వేల కి.మీ ,పైగా పాదయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల మనసులను అర్థం చేసుకున్న రాహుల్ గాంధీని అనుసరించడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు.పాదయాత్ర ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకోవాలని రాహుల్ గాంధీ పిలుపు మేరకు మీనాక్షి నటరాజన్,మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రను ప్రారంభించారు అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు తెలుపుతూ ప్రజా పాలన అందివ్వడానికే ఈ పాదయాత్ర అని అన్నారు.

నిజామాబాద్ • 6 నెలల క్రితం27

నిజామాబాద్ • ఒక రోజు క్రితం13

నిజామాబాద్ • 8 నెలల క్రితం27

నిజామాబాద్ • 4 నెలల క్రితం19

నిజామాబాద్ • 3 నెలల క్రితం18