© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

నిజామాబాద్: గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందారు.తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ నిమ్స్ ఆసుపత్రిలో శనివారం రాత్రి 9.41 నిమిషాలకు మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు. సౌమ్యను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు వెల్లడించారు.విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులు కారుతో ఢీకొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు వైద్య చికిత్సల కోసం ప్రభుత్వం రూ.10 లక్షలు తక్షణ సహాయం కింద మంజూరు చేశారు.జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు.ఆమెకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు..

నిజామాబాద్ • 6 నెలల క్రితం20
నిజామాబాద్ • సుమారు 19 గంటల క్రితం1

నిజామాబాద్ • 8 నెలల క్రితం36

నిజామాబాద్ • సుమారు ఒక నెల క్రితం14
నిజామాబాద్ • 20 రోజుల క్రితం62