© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

నిజామాబాద్: నేర రహిత కమిషనరేటుగా మార్చడానికి తమ వంతు కృషి
2017 నుండి 2025 వరకు కమ్యూనిటి కాంటాక్టు మరియు నేను సైతం క్రింద మొత్తం 8713 సి.సి టివిలు ఏర్పాటు :
సి.సి కెమెరాల ఏర్పాటుకు ప్రజలలో చైతన్యం రావాలి
సి.సి కెమెరాల ఏర్పాటులో నాణ్యమైనవి ఏర్పాటుచేయాలి పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య వెల్లడి.. గతంలో దొంగతనాలు / ఇతరుల పై దాడులు / ప్రజలకు తెలియకుండానే మోసం చేయు సంఘటనలు ఎన్నో జరిగినాయి. వీటిలో చాలాకేసులలో ఎలాంటిది రికవరి అయిన దాఖాలు చాలాతక్కువ, దొంగ దొరికిన అట్టి కేసులో ప్రాపర్టి రికవరి అవడం చాలాతక్కువగా ఉండేది. లేదా ఇతరులపై దాడులు జరిగిన సమయంలో ఎవరు దాడులు చేసిని వారిని గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ప్రస్తుతం నిజామాబాద్ జనరద్దీగల ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి, వాణిజ్య వ్యాపార సాముదాయాలు అప్పటికన్న ప్రస్తుతం చాలా ఎక్కువగా అయ్యాయి, సినిమా దియేటర్లు, బంగారు దుకాణాలు,వస్త్ర వ్యాపారాలు, గ్యాస్ దుఖాణాలు, విధ్యాసంస్థలు, కాలేజీలు, యూనివర్సీటీ అపార్టుమెంట్లు, మొదలగునవి చాలా ఏర్పాటు కావడం జరిగింది. ఆ మార్పుకు అనుకూలంగా ఎక్కడ అభివృద్ధి జరుగలేదు. అభివృద్ధి అనేది నేరారహిత సమాజంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కాని అలా కాకుండా ప్రతి రోజు ఎక్కడో ఒక చోట నేరం జరుగుతునే ఉన్నది. ఆ నేరం జరిగిన సంఘటన నుండి బయట పడేలోపు మరి యొక్క సంఘటన జరుగుతుంది. కావున ఈ నేరాల నుండి విముక్తి పోందాలటే ప్రతీ చోట వారి వారి పరిధిలో సి.సి కెమోరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే కొద్ది మాత్రంగానైనా నేరాలు అదుపులో పెట్టవచ్చు. అందుకోసం ప్రతి ఒక్కరు వారి వ్యక్తిగత ఆడాంబరాలకు (వృద్ధా ఖర్చు) లకు ఉపయోగించే ఖర్చులలో కొద్దిపాటి ఖర్చుతో తమ పరిధిలో సి.సి కెమోరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎంతో కొంత నేరాల నియంత్రణకు నీ వంతు సహయ సహకారాలు అందించిన వారు అవుతారు. కావున ఈ సి.సి కెమోరాల వలన నేరాలు అదుపుచేయడం జరుగుతుంది. నేరాలు చేసేవారు నేరాలు చేయకుండా ఉంటారు. నేరాలు చేసిన వారు ఈ సి.సి టీవి పుటేజీల ద్వారా తొందరగా దొరికి. అట్టి వస్తువులు వెంటనే రికవరి అవుతాయి. దొంగ తప్పించుకోవడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు.ఈ సి.సి కెమెరాల వలన. ఈ సి.సి కెమెరాల వలన గతంలో దేశంలో, రాష్ట్రంలో మన నిజామాబాద్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నో సంఘటనలలో నేరస్తులను త్వరగా పట్టుకోవడం జరిగింది. కావున ప్రజలు కొంత మంది తమ స్వంత విలాసవంతమైన ఖర్చులను చేస్తుఉంటారు. మీ రక్షణ కోసం ఇంటి లోపల మరియు ఇంటి బయట
మరియు వీధిలో అవసరం ఉన్న చోట సి.సి కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే ఏలాంటి నేరాలు జరుగ కుండా అరికట్టినవారు అవుతారు. నేరాలు జరిగినప్పుడు బాదపడేకంటే నేరాలు జరుగక ముందు ముందు జాగ్రత్తలు తీసుకోవడం మేలు. ఈ విధంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటే దొంగిలించిన మనిషితో పాటు దొంగిలింప బడిన వస్తువులు కూడా అతి తక్కువ సమయంలో దొరికిపోతాయి. సి.సి కెమెరాల ఏర్పాటుకు ప్రజలలో చైతన్యం రావాలి, సి.సి కెమెరాల ఏర్పాటులో నాణ్యమైనవి ఏర్పాటుచేయాలి. కావున గతంలో కంటే ప్రస్తుత సమాజంలో అభివృద్ధి చెందుతున్న అన్ని ప్రాంతాలలో సి.సి కెమోరాలు తప్పకుండా అవసరం, ఎక్కడ ఎలాంటినేరాలు జరిగిన అతితక్కువ సమయంలో నేరం చేసిన వారిని పట్టు కోవడంమే కాకూండా, వారు దొంగిలించిన అన్ని వస్తువులను అతితక్కువ సమయంలో రికవరి చేయడం జరుగు తుంది. కావున ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులు. మీరు దొంగతనాలు జరుగకుండా నివారించే పోలీసులు, ప్రాపార్టీ నియంత్రణ ఒక వ్యక్తి లేదా ప్రాణానికి గాని, ఆస్తికి గాని నివారించే భాధ్యత ప్రతివ్యక్తి యొక్క భాద్యత.
భాధ్యతలలో భాగంగా సి.సి కెమోరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎంతో ఉపయోగ పడుతాయి. సమాజం, మన పట్టణం, మన గ్రామం, మన వీధి బాగుంటే మనం బాగుంటాము.అది గ్రహించి, ఈ సమాజం కోసం, మన కోసం, ఈ సమాజానికి మనమేమిచ్చాం, అనే తపనలో ఈ యొక్క సి.సి కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు సహకరించి సమాజం పట్ల బాధ్యతగా మేలగాలని మా భావన.
పై విధమైన చర్యలకు ఎక్కువ కేసులలో సి.సి కెమోరాలు లేని ప్రాంతాలలో జరిగినవి. నేటి సమాజంలో ఎక్కువ కేసులలో నేరస్తులు దొరికిన అట్టి కేసులో రికవరి చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని కేసులలో రికవరి ఉండడం లేదు. చాలా కేసులలో సి.సి కెమోరాల పుటేజి ఎంతో ఉపయోగ పడుతుంది. కోర్టులో ఇలాంటి సాక్షాలు ఎంతో ఉపయోగ పడుతాయి. ఇంకొంత మంది ప్రత్యేకంగా మత పరమైన టెన్షన్ సృష్టించడానికి ఇంకొంతమంది ఇతరుల కులాలను / మతాలను కించపర్చుతూ, ఇంకొంతమంది మహిళల పై అసభ్యకరంగా ప్రవర్తించుట / కాలేజీలలో ఈవ్ టీజింగ్ చేస్తు, శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారు.
ఇలాంటి చర్యల వలన " సైబర్ క్రైమ్ రేటు" రోజు రోజుకు పెరుగుతున్నది. ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండాలంటే సి.సి కెమోరాలు ఎంత గానో ఉపయోగపడుతాయి. వాటి వలన నేరాలు అదుపులో ఉంచవచ్చును.
సి.సి కెమోరాల వలన లాభాలు:
13.క్రీడా మైదానాలలో జరిగే చిన్న చిన్న సంఘటలను అరి కట్టవచ్చును. నేరాలు చేసిన వారిని అతి తక్కువ సమయంలో పట్టుకొనవచ్చును.
"2017 నుండి 2025 వరకు కమ్యూనిటి కాంటాక్ట్ మరియు నేను సైతం క్రింద మొత్తం 8713 సి.సి టివిలు ఏర్పాటుచేయడం జరిగింది అని అన్నారు.

నిజామాబాద్ • 4 నెలల క్రితం19

నిజామాబాద్ • 6 నెలల క్రితం35

నిజామాబాద్ • 8 నెలల క్రితం9

నిజామాబాద్ • 6 నెలల క్రితం27

నిజామాబాద్ • సుమారు 2 నెలల క్రితం20