కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) 10వ వర్ధంతి వేడుకలు - బోధన్ పట్టణంలో ఘన నివాళులు...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) 10వ వర్ధంతి వేడుకలు - నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఘన నివాళులు.
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ బోధన్, మార్చి 09:..
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సోమవారం కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) 10వ వర్ధంతిని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల పార్టీ జెండా గద్దె వద్ద రవన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ.. కామ్రేడ్ రవన్న తన జీవితాంతం విప్లవోద్యమమే శ్వాసగా బతికిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఎదురయ్యే ఆటంకాలను తన అనుభవంతో చక్కదిద్దుతూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయన చెప్పిన "ప్రజా పంథా" సిద్ధాంతాన్ని మల్లేష్ గుర్తుచేశారు. "అతివాదం, మితవాదం సరైన మార్గాలు కావు. దేశంలోని పేద ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజా పంథా మార్గమే సరైనది. ఆయన చూపిన బాటలో నడవడమే రవన్నకు మనం అర్పించే నిజమైన నివాళి" అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్, ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకులు సీతారాం, సిహెచ్ రమేష్, టి లాలయ్య, చంద్రకాంత్, సోం బాలయ్య, ఏ గంగారాం, బండారి శంకర్, కృష్ణ, తులసమ్మ, సావిత్రి, గంగామణి తదితరులు పాల్గొన్నారు.