© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
నిజామాబాద్: గ్రామాభివృద్ధికి సర్పంచ్,పాలకవర్గంతో కలిసి ఐకమత్యంతో కృషి చేస్తాం: కొత్తపల్లి ఉప సర్పంచ్ ఉట్నూర్ సురేష్ గౌడ్.. ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : ముప్కల్ (నిజామాబాద్ జిల్లా):.. నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలంలోని కొత్తపల్లి గ్రామ అభివృద్ధికి సర్పంచ్, పాలకవర్గ సభ్యులందరం ఐకమత్యంతో పనిచేస్తూ, ప్రజా పాలనలో భాగంగా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కొత్తపల్లి గ్రామ ఉప సర్పంచ్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ అన్న ప్రధాన అనుచరుడు ఉట్నూర్ సురేష్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి మరియు పారిశుధ్య పనుల వివరాలను వెల్లడించారు. ప్రధానాంశాలు: *పారిశుధ్య పనులు: గ్రామంలో నిరంతర పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ లేబర్ల సహాయంతో డ్రైనేజీలను పూర్తిగా శుభ్రం చేయించడం జరిగిందని తెలిపారు. *వరద కాల్వల క్లీనింగ్: వర్షాల దృష్ట్యా చెరువు వరద కాల్వ ముప్పు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. *దోమల నివారణ: గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామం మొత్తం ఫాగింగ్ (పిచికారీ) చేయించినట్లు పేర్కొన్నారు. *నీటి లీకేజీల మరమ్మతులు: ఇందిరమ్మ కాలనీలో నెలకొన్న పైపులైన్ లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు తమ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి కి గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,సునీల్ నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టం చేస్తామని,పాలకవర్గమంతా కలిసికట్టుగా గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సురేష్ గౌడ్ స్పష్టం చేశారు.

నిజామాబాద్ • సుమారు ఒక నెల క్రితం14

నిజామాబాద్ • 7 నెలల క్రితం27

నిజామాబాద్ • 8 నెలల క్రితం28
నిజామాబాద్ • 19 రోజుల క్రితం29
నిజామాబాద్ • 24 రోజుల క్రితం12