© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్... జిల్లాలో 65 కేంద్రాల్లో 13,154 మంది విద్యార్థులు హాజరు.. ఈ నెల 14 నుండి ఏప్రిల్ 16 వరకు పరీక్షల నిర్వహణ. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. ఎస్ ఆర్ ఎస్ న్యూస్,కామారెడ్డి, మార్చి 12,.. కామారెడ్డి జిల్లాలో ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. పరీక్షల వివరాలు మరియు గణాంకాలు: జిల్లా వ్యాప్తంగా మొత్తం 65 రెగ్యులర్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మొత్తం 13,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు, 65 మంది డిపార్ట్మెంటల్ అధికారులు మరియు 739 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు కలెక్టర్ వివరించారు. విద్యార్థులకు మరియు అధికారులకు ముఖ్య సూచనలు: సమయ పాలన: పరీక్షలు ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు ఒక గంట ముందుగానే (08:30 గంటలకు) చేరుకోవాలి. హాల్ టికెట్లు: విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ www.bse.telangana.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ లేదా OMR షీట్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి. నిషేధిత వస్తువులు: పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, క్యాల్క్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, చిట్టీలు లేదా పుస్తకాలు తీసుకురావడం కఠినంగా నిషేధించబడింది. కేవలం హాల్ టికెట్, రైటింగ్ ప్యాడ్, పెన్నులు మాత్రమే అనుమతించబడతాయి. నిబంధనలు: సమాధాన పత్రం రాయడం పూర్తయినప్పటికీ, కేటాయించిన సమయం ముగిసే వరకు విద్యార్థులు పరీక్షా హాల్లోనే ఉండాలి.మధ్యలో బయటకు వెళ్లడానికి అనుమతి లేదు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు: పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు లేదా తల్లిదండ్రులు 9959670118 నెంబర్కు కాల్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
కామారెడ్డి • 11 రోజుల క్రితం12
కామారెడ్డి • సుమారు 11 గంటల క్రితం13
కామారెడ్డి • 4 రోజుల క్రితం14
కామారెడ్డి • సుమారు 8 గంటల క్రితం9
కామారెడ్డి • 4 రోజుల క్రితం24