© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: క్రీడల్లో సాంకేతిక ఆవిష్కరణలే లక్ష్యం.. కామారెడ్డిలో ‘స్పోర్ట్స్ హ్యాకథాన్’ పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* ఎస్ ఆర్ ఎస్ న్యూస్ కామారెడ్డి.. క్రీడల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో వరల్డ్ తెలుగు ఐటి అసోసియేషన్ (WTIT) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ‘స్పోర్ట్స్ హ్యాకథాన్’ గోడ పత్రికను జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. క్రీడా రంగంలో సాంకేతికతను జోడించి, క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరచడమే ఈ హ్యాకథాన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో పర్యటిస్తున్న ఈ బృందం నేడు కామారెడ్డి జిల్లాకు చేరుకోవడం సంతోషకరమని, ఇది స్థానిక క్రీడాకారులకు మరియు ఐటి రంగం పట్ల ఆసక్తి ఉన్న వారికి మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) ఉత్తర తెలంగాణ జోన్ సెక్రటరీ శ్రీకాంత్, బృందం సభ్యులు అభిలాష్, మాధవ్, వివేక్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి • 11 రోజుల క్రితం12
కామారెడ్డి • 2 రోజుల క్రితం18
కామారెడ్డి • సుమారు 8 గంటల క్రితం9
కామారెడ్డి • 4 రోజుల క్రితం24
కామారెడ్డి • 4 రోజుల క్రితం62