© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: పదవ తరగతి పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఐపీఎస్.. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (144) అమలు... జిరాక్స్ సెంటర్లు, మొబైల్ ఫోన్లపై కఠిన నిషేధం... ఎస్ ఆర్ ఎస్ న్యూస్ కామారెడ్డి... జిల్లాలో ఈ నెల 14వ తేదీ నుండి వచ్చే నెల 16 వరకు జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఐపీఎస్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ పేర్కొన్న ప్రధానాంశాలు: *సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు సెక్షన్ 163 BNSS (గతంలో 144 సెక్షన్) అమలులో ఉంటుంది. కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం పూర్తిగా నిషేధం. *జిరాక్స్ సెంటర్ల మూసివేత: పరీక్షలు సజావుగా సాగేందుకు వీలుగా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు,ఇంటర్నెట్ షాపులను పరీక్షా సమయంలో తప్పనిసరిగా మూసివేయాలని ఎస్పీ ఆదేశించారు. *ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం: విద్యార్థులు ఎలక్ట్రానిక్ వాచీలు లేదా ఇతర పరికరాలను కేంద్రాల్లోకి తీసుకురావద్దు. అలాగే, విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు మరియు పోలీస్ సిబ్బంది సైతం మొబైల్ ఫోన్లు వినియోగించరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. *బందోబస్తు: విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు తగిన బందోబస్తు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, పరీక్షల క్రమశిక్షణను కాపాడటంలో విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని ఎస్పీ కోరారు.
కామారెడ్డి • ఒక రోజు క్రితం422
కామారెడ్డి • ఒక రోజు క్రితం39
కామారెడ్డి • 5 రోజుల క్రితం82
కామారెడ్డి • ఒక రోజు క్రితం49
కామారెడ్డి • ఒక రోజు క్రితం28