© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: పైలట్ శిక్షణ అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు విమానయాన రంగంలో గొప్ప ఉపాధి అవకాశాలు లభిస్తాయి... కామారెడ్డిలో ‘ఫ్లయింగ్ అకాడమీ’ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే విన్నపం.. ఎస్ ఆర్ ఎస్ న్యూస్ కామారెడ్డి.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కూడిన ‘ఫ్లయింగ్ అకాడమీ’ (పైలట్ శిక్షణా కేంద్రం) ఏర్పాటు చేయాలని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా కేంద్రం ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమని వివరించారు. రాష్ట్ర రాజధానికి అతి తక్కువ దూరంలో ఉండటంతో పాటు, జాతీయ రహదారి మరియు రైల్వే కనెక్టివిటీ మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. అకాడమీ స్థాపనకు అవసరమైన ప్రభుత్వ భూమి జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉందని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.పైలట్ శిక్షణ అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు విమానయాన రంగంలో గొప్ప ఉపాధి అవకాశాలు లభిస్తాయి.ఈ ప్రాజెక్ట్ ద్వారా కామారెడ్డి జిల్లా ఆర్థికంగా మరియు మౌలిక సదుపాయాల పరంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.కామారెడ్డి భవిష్యత్తును మార్చే ఈ ప్రాజెక్టును త్వరితగతిన మంజూరు చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
కామారెడ్డి • సుమారు 11 గంటల క్రితం13
కామారెడ్డి • 2 రోజుల క్రితం18
కామారెడ్డి • 8 రోజుల క్రితం45
కామారెడ్డి • 5 రోజుల క్రితం35
కామారెడ్డి • 5 రోజుల క్రితం82