© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ నిందితుడికి 8 నెలల జైలు శిక్ష.. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర, ఐపిఎస్.. ఎస్ ఆర్ ఎస్ న్యూస్ కామారెడ్డి... కామారెడ్డి: ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడిన నిందితుడికి 8 నెలల జైలు శిక్ష మరియు 300 రూపాయల జరిమానా విధిస్తూ కామారెడ్డి అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బట్టు దీక్ష తీర్పునిచ్చారు. బిక్నూర్ గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు చెట్లపల్లి వేణు తన తండ్రి మరణించిన నేపథ్యంలో, తేదీ 09/07/2025 నాడు ఇంటికి తాళం వేసి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి ఉన్నాయి. బీరువాలో దాచిన 10,000 రూపాయల నగదు గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు గుర్తించి బిక్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, సంఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బిక్నూర్ పాత హరిజనవాడ కాలనీకి చెందిన చిట్లపల్లి సాగర్ (22) ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో అభియోగ పత్రాన్ని (Charge Sheet) దాఖలు చేశారు. విచారణలో భాగంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్, నిందితుడు కూడా తన నేరాన్ని ఒప్పుకోవడంతో అతనికి 8 నెలల కఠిన జైలు శిక్ష మరియు 300 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అధికారులకు అభినందనలు: నేరస్తుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా వాదించిన అసిస్టెంట్ పిపి రజనీని, కేసును దర్యాప్తు చేసిన అప్పటి ఎస్.ఐ. దత్తద్రి గౌడ్‌ను, ప్రస్తుత ఎస్.హెచ్.ఓ. ఆంజనేయులును, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై రామేశ్వర్ రెడ్డి మరియు CDO రాజశేఖర్‌లను జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర,ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
కామారెడ్డి • సుమారు 8 గంటల క్రితం9
కామారెడ్డి • 11 రోజుల క్రితం12
కామారెడ్డి • 4 రోజుల క్రితం62
కామారెడ్డి • ఒక రోజు క్రితం39
కామారెడ్డి • 4 రోజుల క్రితం24