© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: కన్నకూతుళ్లపై కనికరం లేని తండ్రి: ముగ్గురు చిన్నారులను చెరువులో నెట్టి చంపిన కిరాతకుడు.. *కామారెడ్డి పోలీసుల వేగవంతమైన దర్యాప్తులో వీడిన మిస్టరీ. *నిందితుడిపై కఠిన చర్యలు - చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని ఎస్పీ హెచ్చరిక. ఎస్ ఆర్ ఎస్ న్యూస్ కామారెడ్డి.. ఆర్థిక ఇబ్బందులు మరియు చెడు వ్యసనాల కారణంగా ఒక కన్నతండ్రే కాలయముడై తన ముగ్గురు పసిపిల్లలను కడతేర్చిన దారుణ ఘటన కామారెడ్డిలో వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్ వెల్లడించారు. ఘటన నేపథ్యం:కామారెడ్డి పట్టణంలోని ఆర్.బి. నగర్ కాలనీకి చెందిన ఇస్మాయిల్ రాజ్ షేక్ భార్య షబీన బేగమ్, తన ముగ్గురు కుమార్తెలు (సిఫత్, అయ్యద్, మరియమ్) మార్చి 6వ తేదీ నుండి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు మరియు విచారణలో తండ్రి ఇస్మాయిల్ ప్రవర్తనపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. హత్యకు దారితీసిన కారణాలు.. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన ఇస్మాయిల్ రాజ్ షేక్, తనకున్న చెడు అలవాట్ల వల్ల ఆదాయాన్ని వృథా చేస్తూ అప్పులపాలయ్యాడు. కుటుంబ పోషణ భారం కావడంతో పాటు, ముగ్గురు కుమార్తెల వల్ల ఖర్చులు పెరుగుతున్నాయని భావించి, వారిని హతమార్చాలని పథకం రచించాడు. నేరం జరిగిన తీరు:తేదీ 06.03.2026: ఉదయం 11 గంటలకు పిల్లలకు స్నాక్స్ కొనిస్తానని నమ్మించి ఆటోలో కామారెడ్డి పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లాడు.ఎవరూ లేని సమయం చూసి 8, 6 మరియు 5 ఏళ్ల వయస్సు గల తన ముగ్గురు కుమార్తెలను వరుసగా చెరువు నీటిలోకి నెట్టివేశాడు.పిల్లలు కళ్ల ముందే ప్రాణ భయంతో కొట్టుకుంటున్నా కనికరం లేకుండా చూస్తూ ఉండి, వారు మునిగిపోయిన తర్వాత పరారయ్యాడు.సాక్ష్యం దొరక్కుండా పిల్లల ఆధార్ కార్డులను కూడా చెరువు వద్ద రాళ్ల మధ్య పడేశాడు. నిందితుడి వివరాలు:పేరు: ఇస్మాయిల్ రాజ్ షేక్ (38),నివాసం: ఆర్.బి. నగర్ కాలనీ, కామారెడ్డి. అధికారుల స్పందన:"ఈ ఘటన మన సమాజానికే మాయని మచ్చ. ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికం,కానీ ఆవేశపూరిత నిర్ణయాలు తీరని శోకాన్ని మిగిల్చుతాయి. ఏ తండ్రీ ఇలాంటి అమానుషానికి ఒడిగట్టకూడదు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం" అని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన ఇన్స్పెక్టర్లు నరహరి,రామన్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ అభినందించారని ఏఎస్పి బి.చైతన్య రెడ్డి తెలిపారు.
కామారెడ్డి • ఒక రోజు క్రితం125
కామారెడ్డి • ఒక రోజు క్రితం28
కామారెడ్డి • 2 రోజుల క్రితం23
కామారెడ్డి • సుమారు 17 గంటల క్రితం24
కామారెడ్డి • 5 రోజుల క్రితం59