© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: బాలికల ఆరోగ్యమే పరమావధి: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ శక్తి’ ప్రారంభం..
కామారెడ్డి గర్ల్స్ హైస్కూల్లో రీయూజెబుల్ సానిటరీ పాడ్స్ పంపిణీ..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి..
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి మరియు హైదరాబాద్ ఈస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో, ఎస్బీఐ (SBI) కార్పొరేట్ సోషల్ ఫండ్స్ సహకారంతో విద్యార్థినులకు రీయూజెబుల్ సానిటరీ పాడ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 'ప్రాజెక్ట్ శక్తి' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
బాలికల ఆరోగ్యంపై శ్రద్ధ అభినందనీయం: ఏఎస్పీ చైతన్య..ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యార్థినులు చదువుపై మరింత ఏకాగ్రత చూపగలరని, బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రోటరీ క్లబ్ ఇంతటి భారీ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయమని కొనియాడారు. ప్రతి విద్యార్థిని ధైర్యంగా చదువుకుంటూ సమాజంలో రాణించాలని ఆకాంక్షించారు.
రూ. 26 లక్షల విలువైన పాడ్స్ పంపిణీ: రోటరీ సభ్యులు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డా|| యం. జైపాల్ రెడ్డి మరియు ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ.. జిల్లాలోని సుమారు 36 పాఠశాలల్లో ₹26 లక్షల పైగా విలువైన రీయూజెబుల్ సానిటరీ పాడ్స్‌ను పంపిణీ చేయాలని రోటరీ క్లబ్ నిర్ణయించిందని తెలిపారు. దీనికి ఆర్థిక సహకారం అందించిన ఎస్బీఐ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి గారు ఈ సందర్భంగా విద్యార్థినుల తరపున రోటరీ సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజినల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోపీనాథ్ రెడ్డి, డిజిసివో సుకన్య, ప్రాజెక్ట్ చైర్మన్ సి.వి. సుబ్బారావు, గోవింద పుట్ట, రోటరీ అధ్యక్షులు వై. శంకర్, సెక్రటరీ ఎస్. కృష్ణహరి, ట్రెజరర్ వెంకటరమణ, సీనియర్ సభ్యులు శ్రీశైలం, పి. సత్యం, సుధాకర్, కాశీనాథం, జగన్నాథం మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి • ఒక రోజు క్రితం39
కామారెడ్డి • ఒక రోజు క్రితం50
కామారెడ్డి • 2 రోజుల క్రితం422
కామారెడ్డి • సుమారు 11 గంటల క్రితం13
కామారెడ్డి • 4 రోజుల క్రితం24