ఆర్మూర్ మోడల్ స్కూల్లో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ఆర్మూర్ మోడల్ స్కూల్లో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం...
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:ఆర్మూర్, మే15...
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మోడల్ స్కూల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల పి.ఇ.టి (P.E.T) జి. గంగాదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే క్రీడా పోటీలకు క్రీడాకారులను సర్వసద్ధం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణా శిబిరాల నిర్వహణకు పాఠశాల ప్రిన్సిపాల్ శామ్ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని, అందుకు గాను విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పక్షాన ప్రిన్సిపాల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు టాపర్లుగా నిలిచి సాధించిన అద్భుత విజయాల తరహాలోనే, క్రీడల్లోనూ విద్యార్థులు రాణించి ముందంజలో ఉండాలని ప్రిన్సిపాల్ శామ్, పి.ఇ.టి గంగాదాస్ మరియు ఉపాధ్యాయ బృందం ఎంతో పట్టుదలతో కృషి చేస్తున్నారు. పాఠశాల కీర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్న ఉపాధ్యాయ బృందానికి, పాఠశాల యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు ప్రకటించారు.