కామారెడ్డిలో ఈనెల 24, 25 తేదీలలో జరిగే AIPKMS రాష్ట్ర ప్రథమ మహాసభలు విజయవంతం చేయాలి...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ఈనెల 24, 25 తేదీలలో కామారెడ్డి లో జరిగే AIPKMS రాష్ట్ర ప్రథమ మహాసభలు విజయవంతం చేయాలి...
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : బోధన్...
అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం కమిటీ సభ్యులు జి. సీతారాం పిలుపునిచ్చారు. ఈ నెల 24, 25 తేదీలలో కామారెడ్డి పట్టణంలో జరగనున్న ఈ మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆదివారం నాడు బోధన్ పట్టణంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జి. సీతారాం మాట్లాడుతూ, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యత్ పోరాట కర్తవ్యాలను రూపొందించడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు. మహాసభల వివరాలు: మార్చి 24: మధ్యాహ్నం 12:00 గంటలకు కామారెడ్డి మున్సిపల్ గ్రౌండ్ నుండి గంజి వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తారు. బహిరంగ సభ:మధ్యాహ్నం 3:00 గంటలకు వీక్లీ మార్కెట్ ఆవరణలో బహిరంగ సభ జరుగుతుంది. ముఖ్య వక్తలు: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, సి.పి.ఐ (ఎం-ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, నిజామాబాద్-కామారెడ్డి ఉమ్మడి జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్, AIPKMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ తదితర ప్రముఖులు ప్రసంగిస్తారు. రెండవ రోజు కార్యక్రమం: 25వ తేదీన జరిగే ప్రతినిధుల సభలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు పి.విజయరామరాజు స్వాగతం పలుకుతారు. ఆర్థిక విశ్లేషకులు మీ పాపారావు ప్రారంభ ఉపన్యాసం చేయగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.జి.రామచందర్ "వ్యవసాయ కూలీలు - ఎదుర్కొంటున్న సవాళ్లు" అనే అంశంపై ప్రసంగిస్తారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సిహెచ్. రమేష్, మండల నాయకులు బి.సాయిలు,లక్ష్మణ్, పోశెట్టి, శంకర్,సలీం, హైమద్, చావుస్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీలు, ప్రతినిధులు ఈ మహాసభలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నాయకులు కోరారు.