తలసేమియా చిన్నారికి ఆసరాగా డాక్టర్ బాలు.. 84వ సారి రక్తదానం!
తలసేమియా చిన్నారికి ఆసరాగా డాక్టర్ బాలు.. 84వ సారి రక్తదానం!
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: నిజామాబాద్..
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల కదం కీర్తన అనే బాలికకు 'ఓ పాజిటివ్' రక్తం అత్యవసరం కావడంతో, ఆయన నిజామాబాద్ బ్లడ్ సెంటర్లో 84వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ... తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం జీవితాంతం అవసరమవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 6,000 మంది, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల ప్రాణాలను పరిరక్షించేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులోనూ ఇలాంటి బాధితుల కోసం మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రంగ కిషన్, బీమా గౌడ్, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు బట్టు భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.