ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం: బి. మల్లేష్, సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్....
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం: బి. మల్లేష్, సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్...
పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి..
5 వారాలుగా నిలిచిపోయిన కూలి డబ్బుల బట్వాడా...
ఎరాజ్ పల్లిలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ప్రజా పంథా నాయకులు...
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : బోధన్,మే16...
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని, ప్రజలకు కనీస ఉపాధి కూడా లేకుండా బికారులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ తీవ్రంగా ధ్వజమెత్తారు. శనివారం నాడు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలోని చెరువు వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ ప్రజా పంథా మరియు ఏఐపీకేఎంఎస్ (AIPKMS) సంఘాల ఆధ్వర్యంలో నాయకులు సందర్శించారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బి. మల్లేష్ మరియు టి.యు.సి.ఐ (TUCI) నాయకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. మండుతున్న ఎండల్లో పని చేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. పని ప్రదేశంలో ఎండ దెబ్బ తగలకుండా టెంట్లు లేవని, తాగడానికి నీటి వసతి గానీ, ప్రమాదవశాత్తు గాయాలైతే ప్రథమ చికిత్స చేయడానికి ఫస్ట్ ఎయిడ్ బాక్సులు గానీ అందుబాటులో లేవని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూలీలు – బడ్జెట్ కోతపై మండిపాటు: "గత 5 వారాలుగా ఉపాధి కూలీలకు సంబంధించిన కూలి డబ్బులు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఉపాధి హామీ పనుల ఖర్చుల్లో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇస్తే, రాష్ట్రాలు 10 శాతం భరించేవి. కానీ ప్రస్తుత మోదీ ప్రభుత్వం కేంద్ర వాటాను 60 శాతానికి తగ్గించి, రాష్ట్రాల వాటాను 40 శాతానికి పెంచింది. దీనివల్ల రాష్ట్రాలపై భారం పడి, నిధుల కొరతతో పనులు సాగడం లేదు. కొత్త చట్టాల పేరుతో ఈ పథకాన్ని ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోంది." అని నాయకులు ఆరోపించారు. ప్రజా పంథా డిమాండ్లు:ఉపాధి కూలీలకు నిలిచిపోయిన ఐదు వారాల బకాయిలను వెంటనే, వారం వారం పద్ధతిలో చెల్లించాలి. పని ప్రదేశాల్లో మంచినీరు, నీడ కోసం టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు మరియు అవసరమైన పనిముట్లను తక్షణమే సరఫరా చేయాలి. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ వైఖరిని వీడనాడాలి. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ నాయకులు బి.మల్లేష్, టి.యు.సి.ఐ నాయకులు లక్ష్మణ్ మరియు స్థానిక ఉపాధి కూలీలు పాల్గొన్నారు.