కల్లెడ గ్రామంలో మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
కల్లెడ గ్రామంలో మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ...
అధికారుల అనుమతితో పనులు ప్రారంభించిన సర్పంచ్ గంగోళ్ల సుస్మిత ప్రళయ తేజ్..
గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలి: సర్పంచ్ పిలుపు..
అభివృద్ధి పనులకు అడ్డుకట్ట వేయొద్దు: వీడీసీ, మహిళా సంఘాలు...
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : ఆలూర్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలంలోని కల్లెడ గ్రామంలో నూతన మహిళా భవన నిర్మాణానికి మంగళవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గంగోళ్ల సుస్మిత ప్రళయ తేజ్, గ్రామ పాలకవర్గం, మరియు గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) పెద్దల సమక్షంలో ఈ నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. సంబంధిత అధికారుల నుంచి అన్ని రకాల అనుమతులు సాధించిన తర్వాతే ఈ పనులను మొదలుపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది ఒకరి సమస్య కాదు.. గ్రామ అభివృద్ధి ముఖ్యం: సర్పంచ్ ఈ సందర్భంగా సర్పంచ్ గంగోళ్ల సుస్మిత ప్రళయ తేజ్ మీడియాతో మాట్లాడుతూ.. మహిళా భవన నిర్మాణం అనేది ఏ ఒక్క కుటుంబానికో సంబంధించిన సమస్య కాదని, ఇది గ్రామ సంక్షేమానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. గ్రామ శ్రేయస్సును కాంక్షించి, అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో సహకరించాలని ఆమె కోరారు. అడ్డుకట్ట వేయడం సరికాదు: వీడీసీ,మహిళా సభ్యులు..అనంతరం వీడీసీ పెద్దలు,మహిళా సంఘాల సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో జరుగుతున్న మంచి పనులకు కొందరు అడ్డుకట్ట వేయాలని చూడడం సరికాదన్నారు. భవన నిర్మాణ స్థలానికి పక్కనే మున్నూరు కాపు సంఘం భవనం కూడా ఉందని, అందరి ఉమ్మడి ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామాన్ని ముందడుగులో ఉంచేందుకు విభేదాలు పక్కన పెట్టి, అందరూ సహాయ సహకారాలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో వీడీసీ పెద్ద మనుషులు, వార్డు సభ్యులు, గ్రామ యువకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పనులను ప్రారంభించారు.