కొత్తపల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు వేగవంతం : కార్యదర్శి నోముల రాజు..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ముప్కాల్ మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు వేగవంతం...
పెండింగ్ బిల్లులపై కాంట్రాక్టర్ ఆవేదన...
*ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : ముప్కాల్, మార్చి18,...
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.ఈ నిర్మాణ పనుల పురోగతిని పంచాయతీ కార్యదర్శి నోముల రాజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి నోముల రాజు మీడియాతో మాట్లాడుతూ.. సర్పంచ్ బార్కంటి నిశాంత్, ఉపసర్పంచ్ ఉట్నూర్ సురేష్ గౌడ్ మరియు పాలకవర్గం ఆదేశాల మేరకు భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.పనుల్లో జాప్యం లేకుండా చూసేందుకు కాంట్రాక్టర్ ఎండి. జావేద్ హుసేన్ ఆధ్వర్యంలో పనులు వేగవంతం చేయాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.అనంతరం కాంట్రాక్టర్ ఎండి. జావేద్ హుసేన్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం (NREGS) కింద సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో కొత్తపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అయితే, గతంలో తాను పూర్తి చేసిన నెహ్రూ నగర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఏడాది కాలంగా పెండింగ్లో ఉండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదలయ్యేలా చూడాలని ఆయన కోరారు.