పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా 'మాస్ లైన్' నిరసన: బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా 'మాస్ లైన్' నిరసన...
బోధన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు ఖాళీ సిలిండర్లతో ధర్నా...
మూడు నెలల్లో రెండుసార్లు ధరలు పెంచడం దుర్మార్గం: బి. మల్లేష్...
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : బోధన్, జూన్ 08:**
కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా పెంచుతున్న గ్యాస్ సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సోమవారం నాడు పట్టణ హెడ్ పోస్ట్ ఆఫీస్ కేంద్రంగా సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, మహిళలు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో రోడ్డుపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు."పెరిగే ధరలకు హద్దే లేదు- ఏలేటోడికి సిగ్గే లేదు","మూడు నెలల్లో రెండుసార్లు ధరలను పెంచడమా - సిగ్గు సిగ్గు", "పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి"అంటూ ఆందోళనకారులు గళమెత్తారు. సామాన్యుడి నడ్డి విరుస్తున్న మోడీ ప్రభుత్వం: ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు."అధికారంలోకి వస్తే ధరలు పెంచబోమని నమ్మబలికిన మోడీ.. సీటు ఎక్కగానే సామాన్యుడికి అందనంత ఎత్తుకు ధరలను తీసుకెళ్లారు. మార్చి 7న సిలిండర్ పై రూ. 60 పెంచిన కేంద్రం, కేవలం మూడు నెలల వ్యవధిలోనే మళ్లీ ఇప్పుడు రూ. 29 పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచింది." బి. మల్లేష్, డివిజన్ సహాయ కార్యదర్శి.. ఎన్నికల ముందు దేశంలో ఇంధన వనరులకు కొదవలేదని, ధరలు పెరుగుతాయనేవి తప్పుడు ప్రచారాలని నమ్మబలికిన మోడీ.. ఎన్నికలు ముగియగానే అసలు రంగు బయటపెట్టారని విమర్శించారు. ప్రజలపై మోపుతున్న ఈ అదనపు భారం ముమ్మాటికీ మోడీ ప్రభుత్వ పాపమేనని ధ్వజమెత్తారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోకపోతే దేశ ప్రజలే బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పడాల శంకర్, జి. సీతారాం, ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, నాయకులు ఎస్. లక్ష్మి, గంగామణి, నాగమణి, కృష్ణ, దేవయ్య, లాలయ్య, బి. సాయిలు, డి. పోశెట్టి, శంకర్, హనుమాన్లు, లక్ష్మణ్, గంగాధర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.