సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి: బోధన్‌లో భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతి ఘనంగా నిర్వహణ...
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : బోధన్, మార్చి 23,
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి, చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరులు భగత్ సింగ్,రాజగురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతిని బోధన్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ.. సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి అని ఉద్ఘాటించారు.బ్రిటిష్ పాలకులు దేశం వదిలి వెళ్లడమే కాకుండా, ఈ దేశ సంపద ఇక్కడి పేద ప్రజలకు, శ్రమజీవులకు దక్కాలని భగత్ సింగ్ ఆకాంక్షించారని గుర్తుచేశారు. కానీ నేటి పాలకులు దేశవ్యాప్తంగా కార్మికుల శ్రమను,దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.దేశ ప్రజలను కుల మతాల పేరుతో విభజిస్తున్న పాలకుల తీరును ఎండగట్టడమే భగత్ సింగ్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్, నాయకులు ఎండి ఇర్షద్, బాబుమియా, టి.లాలు,ఎస్.కె.మీరా,ఎస్.కె.ముస్తఫా, ఏఐయుకే ఎంఎస్ నాయకులు బోయిడి శంకర్, డి.నాగేశ్వర్,మల్లారం రవి,శ్యామ్,గుళ్ళు సలీం తదితరులు పాల్గొన్నారు.