© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

నిజామాబాద్: సంక్షేమం,అభివృద్ధిలో ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు..
ఆహార భద్రతలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్..
నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్.
అనంతరం మహమ్మద్ అలీ షబ్బీర్
మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, మరియు అభివృద్ధి కార్యక్రమాలు జోడెడ్ల మాదిరిగా పరుగులు పెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.
"ఆహార భద్రతలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్"
రేషన్ కార్డు అంటే ఆహార భద్రత రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలలో 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడంతో పాటు, ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్న బియ్యం సబ్సిడీ ధరలకు అందజేస్తున్నాం. ఈ చర్య భారతదేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది,ఆహార భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్‌గా నిలిచింది.
నిజామాబాదు అర్బన్ నియోజకవర్గంలో ఒకే రోజు 3174 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం సంతోషకరమైన అంశం. గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కొత్తగా వివాహమైన జంటలు మరియు ఇతర కుటుంబాలకు ఈ కార్యక్రమం ఊరటనిస్తుంది.గత ప్రభుత్వాలు రేషన్ కార్డుల జారీని నిర్లక్ష్యం చేసినప్పటికీ, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.
రేషన్ కార్డుల జారీలో పారదర్శకత.. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పారదర్శకంగా, గ్రామసభలు ద్వారా అర్హులను గుర్తిస్తూ నిర్వహిస్తున్నాం. అర్హత గల ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటున్నాం, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది, ఈ దిశగా చేపట్టిన కార్యక్రమాలు దేశంలోనే ఒక మైలురాయిగా నిలుస్తాయి అని అన్నారు.

నిజామాబాద్ • 8 నెలల క్రితం9

నిజామాబాద్ • 3 నెలల క్రితం18

నిజామాబాద్ • ఒక రోజు క్రితం13

నిజామాబాద్ • 6 నెలల క్రితం17

నిజామాబాద్ • 6 నెలల క్రితం34