చైర్మన్,వైస్ చైర్మన్ లను ఘనంగా సన్మానించిన మోత్కూరి లింగా గౌడ్..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన చైర్మన్,వైస్ చైర్మన్ ఘనంగా సన్మానించిన మోత్కూరి లింగా గౌడ్..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి...
ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల లో భాగంగా ఇటీవల గెలుపొందిన చైర్మన్ గోనె లహరి- రఘు,వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించిన ఆర్మూర్ ప్రాంత సీనియర్ రాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సందర్భంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా గతంలో ఆర్మూర్ మొట్టమొదటి మున్సిపల్ ఏర్పాటు జరిగిన తరుణంలో అప్పుడు మరియు ఇప్పుడు పద్మశాలి ముద్దుబిడ్డ ,విద్యావేత్త ప్రజలతో మమేకమైన నాయకురాలు అందరితో కలిసిపోయి సమస్యను పరిష్కరించే విజ్ఞానం ఉన్న విద్యావేత్త పద్మశాలి ముద్దుబిడ్డ యువకురాలు చైర్మన్ గోనె లహరి-రఘు కు అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఆర్మూర్ ప్రాంత పద్మశాలి తరఫున గోనే లహరి-రఘు,అలాగే సీనియర్ రాజకీయ నాయకులు, యువకులతో,పెద్దమనుషులతో మమేకమైనటువంటి సహజ గుణం కలిగిన మృదుస్వభావి కాటిపల్లి వెంకటరెడ్డిని సన్మానించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నట్టు ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మోత్కూరి లింగ గౌడ్ తెలిపారు.గోనే దామోదర్, ఆర్మూర్ మాజీ సర్పంచ్ కొంగి సదాశివ్,అర్హుల్ నరసయ్య, ఆర్మూర్ మాజీ ఎంపీపీ నరసన్న,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.