ఆర్మూర్ మున్సిపల్ తై బజార్ రద్దు ప్రజా విజయం: బీఆర్ఎస్ (టీఆర్ఎస్) కౌన్సిలర్ పృథ్వీరాజ్...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ఆర్మూర్ మున్సిపల్ తై బజార్ రద్దు ప్రజా విజయం: బీఆర్ఎస్ (టీఆర్ఎస్) కౌన్సిలర్ పృథ్వీరాజ్....
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : ఆర్మూర్, మార్చి 31...
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో తై బజార్ వేలం పాటను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ స్వాగతించింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ఇది సామాన్య రైతులు మరియు చిరు వ్యాపారస్తుల విజయమని పేర్కొన్నారు.గత కొంతకాలంగా తై బజార్ నిర్వాహకులు రైతులు మరియు వ్యాపారస్తులను తీవ్రంగా వేధిస్తున్నారని, అమ్మకాలు జరగకముందే డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయి.మాజీ ఎమ్మెల్యే చొరవ: ఈ వేధింపుల విషయమై బాధిత రైతులు, వ్యాపారస్తులు మాజీ శాసనసభ్యులు జీవన్ రెడ్డి ని కలిసి తమ ఆవేదనను తెలియజేశారు.మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో,టీఆర్ఎస్ పార్టీ నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చింది. రద్దుపై హర్షం: కౌన్సిలర్లను మేనేజ్ చేస్తూ సాగుతున్న ఈ దౌర్జన్యాలకు ముగింపు పలుకుతూ వేలం పాటను రద్దు చేయడం పట్ల పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. 'జనతా గ్యారేజ్' వేదికగా ప్రజలు చేసిన ఫిర్యాదులపై స్పందించి, తై బజార్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేయడంతోనే ఈ పీడ విరగడయిందని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాన భూమిక పోషించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి,పృథ్వీరాజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఏ కష్టం వచ్చినా క్షేత్రస్థాయిలో పోరాడి వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.