లడక్ శిఖరాన్ని అధిరోహించిన కామారెడ్డి విద్యార్థి: విస్లావత్ బన్నీకి ఘన సన్మానం..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
మౌంట్ కాంగ్ యాస్తే–2 శిఖరాన్ని అధిరోహించిన కామారెడ్డి విద్యార్థి: ఘనంగా సన్మానించిన కౌన్సిలర్ నిట్టు గంగాధర్ రావు
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి, జూన్ 29
కామారెడ్డి గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి విస్లావత్ బన్నీ అరుదైన ఘనత సాధించారు. లడక్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'మౌంట్ కాంగ్ యాస్తే–2' శిఖరాన్ని విస్లావత్ బన్నీ విజయవంతంగా అధిరోహించి, కళాశాలకే కాకుండా కామారెడ్డి జిల్లా కీర్తిని దశదిశలా చాటారు. ఈ విశేష విజయాన్ని పురస్కరించుకుని, స్థానిక 6వ వార్డు కౌన్సిలర్ శ్రీ నిట్టు గంగాధర్ రావు ప్రత్యేకంగా విద్యార్థి బన్నీని అభినందించారు. ఈ సందర్భంగా బన్నీని ఘనంగా సన్మానించి, శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో బన్నీ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, క్రీడా రంగంలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కౌన్సిలర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మామిండ్ల మారుతి, కళాశాల అధ్యాపకులు, యువజన నాయకులు సంగిచెట్టి చిన్న రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి బన్నీ సాధించిన ఈ విజయం జిల్లాలోని యువతకు, క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని వారు పేర్కొన్నారు.