ఆర్.కె. కళాశాలలో ఘనంగా 'మై భారత్' అవగాహన సదస్సు..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
'మై భారత్' పోర్టల్ ద్వారా యువతకు ఉజ్వల భవిష్యత్తు: రాష్ట్ర డైరెక్టర్ అన్వేష్
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి, జూన్ 29..
స్థానిక ఆర్.కె. కళాశాలలో సోమవారం "మై భారత్" (MY Bharat) పోర్టల్ రిజిస్ట్రేషన్ల ప్రాముఖ్యత మరియు మాదకద్రవ్యాల (Drugs) నిర్మూలనపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్.కె. సంస్థల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి "మై భారత్" తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ అన్వేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతకు సువర్ణావకాశం.. ఈ సందర్భంగా అన్వేష్ మాట్లాడుతూ,యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు, జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రతి విద్యార్థి "మై భారత్" పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.మత్తుకు దూరంగా.. ప్రగతి వైపు కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల యువజన అధికారి రమేష్ మరియు కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకం యువత జీవితాలను, భవిష్యత్తును ఎలా నాశనం చేస్తుందో వివరించారు. డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక దుష్ప్రభావాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. యాంటీ-డ్రగ్స్ ప్రతిజ్ఞ.. ఎక్సైజ్ సీఐ సంపత్, ఎస్ఐ రచన మరియు పోలీస్ సిబ్బంది సమక్షంలో.. విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, సమాజం నుండి డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.