తిప్పాపూర్ PACS చైర్మన్‌గా తిరుపరి భీంరెడ్డి నియామకం.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసిన నూతన చైర్మన్..
తిప్పాపూర్ నూతన PACS చైర్మన్‌గా తిరుపరి భీంరెడ్డి బాధ్యతలు.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో ఘన సన్మానం
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:హైదరాబాద్...
కామారెడ్డి జిల్లా,భిక్నూర్ మండలం తిప్పాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన చైర్మన్‌గా నియమితులైన తిరుపరి భీంరెడ్డి శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిప్పాపూర్ PACS సొసైటీ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు షబ్బీర్ అలీ కి భీంరెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన భీంరెడ్డిని షబ్బీర్ అలీ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో, ముఖ్యంగా రైతుల ఆర్థిక పురోగతిలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. PACS ద్వారా రైతులకు అవసరమైన సేవలు మరింత సమర్థవంతంగా అందేలా చూడాలని, అన్నదాతల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని నూతన చైర్మన్‌ను సూచించారు. తనపై నమ్మకంతో PACS చైర్మన్ బాధ్యతలు అప్పగించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన తిరుపరి భీంరెడ్డి.. తిప్పాపూర్ సొసైటీ పరిధిలోని రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. సొసైటీ ద్వారా రైతులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు, రుణాలు మరియు వ్యవసాయ సంబంధిత సేవలు సకాలంలో అందేలా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన భీంరెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందించారు. తిప్పాపూర్ PACS చైర్మన్‌గా భీంరెడ్డి నియామకం పట్ల తిప్పాపూర్ మరియు భిక్నూర్ మండలాల కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భిక్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్, తిప్పాపూర్ సర్పంచ్ లింగారెడ్డి, వరలక్ష్మి, కనకవ్వ, సుభాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రమేష్, కొమురయ్య, యాదగిరి, మాసయ్య, మధుసూదన్, వినయ్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.