నిజామాబాద్ యువతికి పునర్జన్మ: యశోద వైద్యుల అద్భుత వైద్యం..
నిజామాబాద్ యువతికి పునర్జన్మ: యశోద వైద్యుల అద్భుత వైద్యం..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి:
ప్రాణాంతకమైన అరుదైన రక్త సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన నిజామాబాద్‌కు చెందిన ఓ యువతికి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి (సోమాజిగూడ) వైద్యులు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. క్లిష్టమైన ఈ కేసును హీమటాలజీ వైద్య బృందం విజయవంతంగా పరిష్కరించింది. వ్యాధి లక్షణాలు మరియు గుర్తింపు యువతిని పరీక్షించిన వైద్యులు ఆమె 'థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపీనిక్ పర్పురా' (TTP) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. శరీరంలోని చిన్న రక్తనాళాల్లో సూక్ష్మ రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల ఈ వ్యాధి సోకుతుందని, దీనివల్ల ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి మెదడు, మూత్రపిండాలు, గుండె వంటి కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు తెలిపారు. గర్భధారణ సమయంలో వచ్చే ఇతర సమస్యల లక్షణాలతో ఇది పోలి ఉండటం వల్ల దీనిని సకాలంలో గుర్తించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. విజయవంతమైన చికిత్స యశోద ఆసుపత్రి సోమాజిగూడ కన్సల్టెంట్ క్లినికల్ హీమటాలజిస్ట్, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ వైద్య నిపుణులు డాక్టర్ జి. విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ చికిత్స నిర్వహించారు. అత్యవసరంగా చికిత్సాత్మక ప్లాస్మా మార్పిడి (Therapeutic Plasma Exchange) తో పాటు స్టెరాయిడ్ చికిత్సను అందించారు. ఈ వైద్యానికి యువతి అద్భుతంగా స్పందించడంతో ఆమె రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా పెరిగి ఆరోగ్యం పూర్తిగా స్థిరపడింది. సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం మరియు వివిధ వైద్య విభాగాల సమన్వయం వల్లే ఈ ప్రాణాంతక పరిస్థితిని విజయవంతంగా ఎదుర్కోగలిగామని వైద్యులు తెలిపారు. యశోద ఆసుపత్రుల సేవలు గత మూడు దశాబ్దాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న యశోద హాస్పిటల్స్... హైదరాబాద్‌లోని సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్‌పేట్, హైటెక్ సిటీ ప్రాంతాలలో 4,000 పడకల సామర్థ్యంతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను విసృతంగా అందిస్తోంది. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ సుధీర్ రెడ్డి, దుర్గా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.