కామారెడ్డి
కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘ కొత్త కమిటీ ఎన్నిక పూర్తి..
SRS NEWS
09 Aug 2026, 05:35 PM
15
కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం / ప్రశాంతం...
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి..
కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం 2026-2029 త్రివార్షిక నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. న్యాయవాది క్యాతం సిద్దిరాములు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా, ఈ ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో పట్టణంలోని పద్మశాలి సంఘ సభ్యులు, యువజన సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతన కార్యవర్గ వివరాలు:
- అధ్యక్షులు: సబ్బని కృష్ణహరి
- కార్యదర్శి: గుర్రపు నర్సింహ స్వామి
- కోశాధికారి: అల్వాల్ గోపాల్ ఉపాధ్యక్షులు:
- దూస వెంకటస్వామి
- పడిగె శ్రీనివాస్
- అల్వాల్ సతీష్
- కైరంకొండ రమేష్ సహాయ కార్యదర్శులు:
- బండమీది రాజేశం
- నక్క శ్రీనివాస్
- జొర్రిగల నర్సయ్య
- మామిడాల వెంకటస్వామి నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యవర్గ సభ్యులకు పద్మశాలి సంఘం నాయకులు, శ్రేయోభిలాషులు మరియు స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు. సంఘం అభివృద్ధికి, సమాజ సంక్షేమానికి నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.