కామారెడ్డి
నీట్, జేఈఈలకు లాంగ్‌టర్మ్ ఉచిత శిక్షణ: దరఖాస్తుల ఆహ్వానం..
SRS NEWS
13 Aug 2026, 06:09 AM
38
నీట్, జేఈఈలకు లాంగ్‌టర్మ్ ఉచిత శిక్షణ: దరఖాస్తుల ఆహ్వానం..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి..
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIS) ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ఉచిత లాంగ్‌టర్మ్ శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు నీట్-యూజీ (NEET-UG), జేఈఈ (JEE-2027) ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఉమ్మడి కామారెడ్డి జిల్లా బీసీ గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్త సి.రాధిక తెలిపారు. ముఖ్యమైన వివరాలు:
- అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, నీట్ లేదా జేఈఈ-2026లో ప్రతిభ కనబరిచిన బీసీ విద్యార్థులు అర్హులు.
- ఆదాయ పరిమితి: గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు.
- దరఖాస్తు గడువు: ఈ నెల ఆగస్టు 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
- అధికారిక వెబ్సైట్: ఆసక్తి గల విద్యార్థులు https://mjptbcadmissions.org వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సీట్ల వివరాలు & శిక్షణ కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 240 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు నిపుణులైన అధ్యాపకులతో బోధన, ఉచిత వసతి, స్టడీ మెటీరియల్‌తో పాటు మాక్ టెస్టులు నిర్వహించనున్నారు. బాలికలు నీట్ (NEET) లో 100 సీట్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాల, నాగోల్.. బాలికలు జేఈఈ (JEE) లో 40 సీట్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాల, నాగోల్.. బాలురు నీట్ లో (NEET) 50 సీట్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాల, అబ్దుల్లాపూర్‌మెట్.. బాలురు జేఈఈ లో (JEE) 50 సీట్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాల, అబ్దుల్లాపూర్‌మెట్ .. గమనిక: విద్యార్థుల మెరిట్ మరియు సీట్ల లభ్యత ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అందిస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని బీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, ప్రముఖ వైద్య, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో సీట్లు సాధించాలని సమన్వయకర్త సి. రాధిక కోరారు.