కామారెడ్డి రైల్వే స్టేషన్లో 6 కిలోల గంజాయి స్వాధీనం..
కామారెడ్డి రైల్వే స్టేషన్లో 6 కిలోల గంజాయి స్వాధీనం
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్ మరియు కామారెడ్డి జిల్లా మధ్య నిషేధ అధికారి ముకందరెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు చేపట్టిన సంయుక్త తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. సంబల్పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ రైలులో గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు.. కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, జిల్లా టాస్క్ ఫోర్స్ (DTF) సిబ్బంది మరియు రైల్వే పోలీసుల సహకారంతో సంయుక్తంగా రైలులో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమ రవాణాకు సంబంధించిన 6 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి నిందితులు ఎవరూ పట్టుబడలేదని పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న అధికారులు మరియు సిబ్బంది:
- సీఐలు: సంపత్ కృష్ణ (కామారెడ్డి ఎక్సైజ్), సుందల్ సింగ్ (డీటీఎఫ్)
- ఎస్సైలు: విక్రమ్ కుమార్, శ్రీనివాస రావు, శరత్ కుమార్
- ట్రైనీ ఎస్సైలు: అనిల్, మధు
- సిబ్బంది: జాన్, ఫరీద్, అమృత్ రెడ్డి, శంకర్, పవన్, నర్సింలు, శరత్, దినేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.