కామారెడ్డి PACS చైర్మన్గా చిందల శ్రీనివాస్ రెడ్డి.. షబ్బీర్ అలీ అభినందన..
కామారెడ్డి మండలం నూతన PACS చైర్మన్గా చిందల శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో ఘన సన్మానం..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:హైదరాబాద్..
కామారెడ్డి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన చైర్మన్గా నియమితులైన చిందల శ్రీనివాస్ రెడ్డి శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డి PACS సొసైటీ చైర్మన్గా తనకు అవకాశం కల్పించినందుకు షబ్బీర్ అలీ కి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డిని షబ్బీర్ అలీ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా అభినందించారు. సొసైటీ ద్వారా రైతులకు అవసరమైన సేవలు మరింత సమర్థవంతంగా అందేలా కృషి చేయాలని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, కామారెడ్డి మండల అధ్యక్షులు రాజగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, రాజు, రాజేష్, సీతారాం నాయక్, రమేష్ నాయక్, రమేష్, వెంకటేశ్వర్, సాయిలు, లింగం, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నూతన చైర్మన్ నియామకం పట్ల కామారెడ్డి మండల కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.