అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ హామీ..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ హామీ..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి..
జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులను పారదర్శకంగా అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి (DPRO) వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ, టీయుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో బుధవారం జర్నలిస్టులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో యూనియన్ ప్రతినిధులను కలెక్టర్ ప్రత్యేకంగా ఆహ్వానించి చర్చలు జరిపారు. కలెక్టర్ దృష్టికి సమస్యలు.. జిల్లాలో ఆమోదం పొందిన 273 అక్రిడిటేషన్ కార్డుల పంపిణీలో డిపిఆర్వో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆమోదం పొందిన కార్డులను పంపిణీ చేయకుండా అనవసరమైన ఆంక్షలు విధిస్తున్నారని జర్నలిస్టులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బస్ పాసుల విషయంలోనూ జర్నలిస్టుల పట్ల డిపిఆర్వో అనుచితంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను తక్షణమే బదిలీ చేయాలని లేదా సరెండర్ చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సానుకూల స్పందన.. జర్నలిస్టుల ఆవేదనను విన్న కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సానుకూలంగా స్పందించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందుతాయని హామీ ఇచ్చారు. డిపిఆర్వో తీరుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్‌కు పర్యవేక్షణ బాధ్యతలు.. అక్రిడిటేషన్ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి కి అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో కలిసి, అర్హులైన వారందరికీ త్వరితగతిన కార్డులు అందేలా చూడాలని అదనపు కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సానుకూల స్పందనతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో TUWJ (IJU) జిల్లా అధ్యక్షుడు వి. రజినీకాంత్, కార్యదర్శి తోట రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పట్నం శ్రీనివాస్, కార్యదర్శి సుధాకర్ గౌడ్, వివిధ నియోజకవర్గాల జర్నలిస్టులు, ఈసీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.