మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే : కామారెడ్డి ఎస్పీ..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
మద్యం మత్తులో వాహనాలు నడిపితే జైలు ఖాయం: ఎస్పీ రాజేష్ చంద్ర..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ :కామారెడ్డి, జూన్ 29..
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా కామారెడ్డి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 73 మంది వాహనదారులకు కోర్టు జరిమానాలతో పాటు జైలు శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ వివరాలను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సోమవారం వెల్లడించారు. కోర్టు శిక్షల వివరాలు: జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 73 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితుల్లో 14 మందికి ఒక్క రోజు, ఒకరికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు, మొత్తం 73 మందికి కలిపి రూ. 88,700 జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు. కుటుంబాల భద్రత ముఖ్యం: ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, "మద్యం మీ కళ్లను తాత్కాలికంగా మూయవచ్చు.. కానీ మీ కుటుంబ కళ్లలో కన్నీరు నింపకండి" అని హితవు పలికారు. క్షణిక మత్తులో తీసుకునే నిర్లక్ష్య నిర్ణయాలు జీవితాంతం బాధను మిగులుస్తాయని, అమాయకుల ప్రాణాలు తీసే డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని హెచ్చరించారు. జిల్లాలో ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.