ప్రభుత్వ ఆసుపత్రిలో వైభవంగా అన్నదానం..
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
ప్రభుత్వ ఆసుపత్రిలో వైభవంగా అన్నదానం: 500 మందికి భోజన సదుపాయం
-
పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి ఆలయం ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం
-
దాతల సేవలు అభినందనీయం: ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ :కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్ ఆలయం ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నదానాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఎంతోమంది పేద రోగులు, వారి సహాయకులు నమ్మకంతో ప్రభుత్వ వైద్యశాలకు వస్తుంటారని, అలాంటి వారికి పౌర్ణమి వేళ అన్నదానం చేయడం ఎంతో పుణ్యకార్యమని కొనియాడారు. సామాజిక దృక్పథంతో సేవలు అందిస్తున్న శ్రీ పరంజ్యోతి ఆలయ నిర్వాహకులకు, దాతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి భోజన సదుపాయం కల్పించారు. నెలకు రూ. 251 తో అన్నదాన భాగస్వామ్యం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ... ప్రతి నెల రూ. 251 చెల్లించి ఈ అన్నదాన సేవా యజ్ఞంలో భాగస్వాములవుతున్న దాతల పేరిట ఆలయంలో పూజలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల ఆశీస్సులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలనుకునే దాతలు 9849601438 (ఎర్రం చంద్రశేఖర్) నంబర్‌కు తమ విరాళాలను పంపి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సేవా కార్యక్రమంలో ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్, ఎర్రం విజయ్ కుమార్, డాక్టర్ బాలు, కస్వ వెంకన్న, దొంతి సుధాకర్, ఎల్లంకి సుదర్శన్, కొమిరిశెట్టి దిగంబర్, పార్శి శ్రీనివాస్, ముస్త్యాల రమేష్, సిద్ధంశెట్టి శ్రీనివాస్, పిప్పిరిశెట్టి వెంకటేశం, గజవాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.