ఆశా వర్కర్లకు రూ. 26 వేల కనీస వేతనం అమలు చేయాలి
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
ఆశా వర్కర్లకు రూ. 26 వేల కనీస వేతనం అమలు చేయాలి
-
సమస్యలు పరిష్కరించకుంటే డిసెంబర్ 1న 'చలో ఢిల్లీ'కి పిలుపు
-
కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా
కామారెడ్డి:(ఎస్ ఆర్ ఎస్ న్యూస్)
ఆశా వర్కర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి, రూ. 26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే డిసెంబర్ 1వ తేదీన 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సమాజ ఆరోగ్య పరిరక్షణలో ఆశా వర్కర్ల సేవలు ఎంతో కీలకమైనవని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల మొండి వైఖరి అవలంబించడం తగదని విమర్శించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ ప్రయోజనాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించడం సరికాదని, తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందిరా, రాజశ్రీలతో పాటు నాయకులు మమత, ప్రమీల, లలిత, భాగ్యలక్ష్మి, వరలక్ష్మి, భాగ్య, యశోద, నాగమణి, గంగమణి, స్వప్న, కృష్ణవేణి, లత, అనిత, విజయ, సుమలత, మంజుల, పల్లవి తదితరులు పాల్గొన్నారు.