'పిల్లల ప్రజావాణి'కి విశేష స్పందన
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
'పిల్లల ప్రజావాణి'కి విశేష స్పందన
-
మొత్తం 148 ఫిర్యాదులు, వినతుల స్వీకరణ
-
సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు : అధికారులు
కామారెడ్డి,(ఎస్ ఆర్ ఎస్ న్యూస్):
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "పిల్లల ప్రజావాణి" కార్యక్రమానికి విద్యార్థులు, చిన్నారుల నుండి విశేష స్పందన లభించింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై మొత్తం 148 ఫిర్యాదులు, వినతులు అందినట్లు అధికారులు వెల్లడించారు. బాలలు తాము ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఫిర్యాదులను అందజేశారు. స్వీకరించిన ఈ 148 వినతులను అంశాల వారీగా వర్గీకరించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాటి సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, పిల్లలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఎవరైనా నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు. బాలల రక్షణ, సంక్షేమం కోసం జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొంటూ.. పిల్లల సమస్యల పరిష్కారంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు మరియు సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.