ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా డాక్టర్ ఎం.జైపాల్ రెడ్డి ఎన్నిక
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా డాక్టర్ ఎం.జైపాల్ రెడ్డి ఎన్నిక
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) తెలంగాణ రాష్ట్ర శాఖ ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఆర్కే గ్రూప్ సీఈఓ డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. నవంబర్ 14న హైదరాబాద్లోని రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శివ ప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో, రాష్ట్ర చైర్మన్ శ్రీ దాన కిషోర్ (ఐఏఎస్) అధ్యక్షతన రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉన్న డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. సేవా కార్యక్రమాలే లక్ష్యం: ఈ సందర్భంగా డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు రెడ్ క్రాస్ ద్వారా మెరుగైన వైద్య, సేవా కార్యక్రమాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా 'నషా ముక్త భారత్' (మత్తు పదార్థాల నిర్మూలన) మరియు ఆరోగ్య సంబంధిత అవగాహన కార్యక్రమాలను సమర్థవంతమైన బృందంతో కలిసి మరింత విస్తృతంగా చేపడతామని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, రాష్ట్ర చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన దాన కిషోర్ (ఐఏఎస్), రాష్ట్ర సెక్రటరీ అండ్ సీఈఓ శ్రీరాములు, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అభినందనల వెల్లువ: రాష్ట్ర స్థాయి కమిటీలో స్థానం సంపాదించిన డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డికి కామారెడ్డి జిల్లా ఐఆర్సీఎస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, సభ్యులు డాక్టర్ బాలు, దత్తాత్రి, ఇతర కమిటీ సభ్యులు, ఆర్కే గ్రూప్ అధ్యాపక బృందం, సిబ్బంది మరియు వివిధ స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.