© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: కళాశాల భూములను కాపాడటంలో విద్యార్థి సంఘాలదే కీలక పాత్ర: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల పరిరక్షణకై డిమాండ్.. ఎస్ ఆర్ ఎస్ న్యూస్ కామారెడ్డి,ఫిబ్రవరి 24,.. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులు,సంస్థలకు కట్టబెట్టడంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంగళవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివిధ విద్యార్థి సంఘాల నేతలు (TNSF, SFI, PDSU, NSUI, BVM, TJS, BC విద్యార్థి సంఘం, GVS) ఉమ్మడిగామాట్లాడారు.భూముల మళ్లింపుపై ధ్వజం: గతంలో రైతుల నుండి సేకరించిన 264 ఎకరాల భూమిని విద్యార్థుల అవసరాల కోసం కాకుండా, అప్పటి కమిటీ సభ్యులు రాజిరెడ్డి తదితరులు FCI గోడౌన్లు, పోలీస్ స్టేషన్, స్టేడియం మరియు ప్రైవేట్ పాఠశాలలకు మళ్లించారని నాయకులు ఆరోపించారు. 2015లోనే కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ రద్దు అయినప్పటికీ, 2018లో అదే సొసైటీ పేరుతో శిశు మందిర్ పాఠశాలకు 2 ఎకరాల 2 గుంటల భూమిని లీజుకు ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యాన్ని ప్రశ్నించారు.డిగ్రీ కళాశాల పరిధిలో అక్రమంగా నిర్మించిన ప్రైవేటు భవనాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని,వాటిని విద్యార్థులకు వసతి గృహాలుగా (Hostels) మార్చాలని డిమాండ్ చేశారు.రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని, ఇక్కడ ఇంజనీరింగ్, లా, నర్సింగ్, పాలిటెక్నిక్ మరియు మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు.అరోరా ఇంజనీరింగ్ కళాశాల సమస్యలకు ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని, చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డికి కేంద్రీయ విశ్వవిద్యాలయం (Central University) తీసుకురావాలని సవాల్ విసిరారు.కళాశాల భూముల జోలికి వస్తే ఎంతటి రాజకీయ నాయకుడైనా సరే,విద్యార్థి లోకం తగిన గుణపాఠం చెబుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాలు (TNSF), విఠల్ (BVM), అరుణ్ కుమార్ (SFI),లక్ష్మణ్ (TJS), సురేష్ (PDSU), నాగరాజు (BC సంఘం), భరత్ కుమార్ (NSUI), వినోద్ (GVS) తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి • 4 రోజుల క్రితం62
కామారెడ్డి • ఒక రోజు క్రితం28
కామారెడ్డి • 2 రోజుల క్రితం18
కామారెడ్డి • 2 రోజుల క్రితం23
కామారెడ్డి • సుమారు 9 గంటల క్రితం31