లింగాపూర్‌లో ఉచిత పశు వైద్య శిబిరం: పశు సంపదతోనే రైతులకు ఆర్థిక భరోసా జిల్లా కలెక్టర్..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
లింగాపూర్‌లో ఉచిత పశు వైద్య శిబిరం: పశు సంపదతోనే రైతులకు ఆర్థిక భరోసా..
ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
36 పశువులకు వైద్య సేవలు,23 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : కామారెడ్డి జిల్లా బ్యూరో...
పాడి రైతుల ఆర్థికాభివృద్ధిలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుందని, పశువుల ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లింగాపూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ శిబిరంలో పశువైద్యాధికారులు పశువులకు వివిధ రకాల వైద్య సేవలు అందించారు. 20 గేదెలకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు చేశారు.16 పశువులకు సాధారణ వ్యాధుల నిమిత్తం వైద్యం అందించారు. 23 దూడలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగింది. అనంతరం నిర్వహించిన 'కాఫ్ ర్యాలీ' ద్వారా సుమారు 35 మంది రైతులకు పశుపోషణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశు వైద్య సేవలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువులకు సకాలంలో వైద్యం అందించడం ద్వారా ఉత్పాదకత పెరిగి, రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. దూడల సంరక్షణ మరియు పశుగ్రాసాల సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డా. భరత్, పశువైద్యాధికారి డా. రవికిరణ్, కౌన్సిలర్ కాసర్ల రాణి, విజయ్ డైరీ అధ్యక్షుడు బండారి నరేందర్ రెడ్డి, కార్యదర్శి మంచాల రాజు, సంజీవ్ రెడ్డి, పశు వైద్య సిబ్బంది బి. ప్రవీణ్ గౌడ్, గోపాలమిత్రులు ఎన్. శ్రీనివాస్, బాబాగౌడ్, బాలయ్య మరియు స్థానిక పాడి రైతులు పాల్గొన్నారు.