కామారెడ్డి మెడికల్ కాలేజీకి రూ.24.40 కోట్లు మంజూరు
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
కామారెడ్డి మెడికల్ కాలేజీ అభివృద్ధికి రూ.24.40 కోట్లు మంజూరు
-
తెలంగాణ పబ్లిక్ స్కూల్కు రూ.10 కోట్లు కేటాయింపు
-
కాలేజీకి 32 పీజీ సీట్లు రావడం శుభపరిణామం
-
త్వరలో క్రిటికల్ కేర్ సెంటర్, ఎంసీహెచ్ ప్రారంభం
-
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెల్లడి
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ :కామారెడ్డి
కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.24.40 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. సోమవారం మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జీవో నంబర్ 175 ద్వారా మంజూరైన రూ.24.40 కోట్లతో కాలేజీ భవనాలు, బాలుర, బాలికల హాస్టళ్లు, కిచెన్, డైనింగ్ హాల్, ప్రిన్సిపల్ క్వార్టర్స్ నిర్మాణాలతో పాటు అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, కాంపౌండ్ వాల్, తాగునీరు, విద్యుత్, రెండు లిఫ్టుల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహలకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
32 పీజీ సీట్ల మంజూరు.. త్వరలో కొత్త ఆసుపత్రులు:
కామారెడ్డి మెడికల్ కాలేజీకి అదనంగా 32 పీజీ సీట్లు మంజూరు కావడం సంతోషకరమని, దీనివల్ల నిపుణులైన వైద్యులు తయారవుతారని షబ్బీర్ అలీ అన్నారు. త్వరలోనే మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా క్రిటికల్ కేర్ సెంటర్, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్) ప్రారంభించి, పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని ప్రిన్సిపాల్, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఇలియాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్, నాయకులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.