మద్నూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 9 మంది అరెస్ట్
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
మద్నూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 9 మంది అరెస్ట్
-
రూ. 84,700 నగదు, 7 సెల్ఫోన్లు స్వాధీనం
-
జూదంతో జీవితాలను నాశనం చేసుకోవద్దు: జిల్లా ఎస్పీ
కామారెడ్డి, నవంబర్ 15:
కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామంలోని ఓ పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. అక్కడ పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుండి రూ. 84,700 నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జూదానికి దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జూదం ఒక వ్యసనంగా మారితే విలువైన సమయంతో పాటు కష్టపడి సంపాదించిన డబ్బు వృథా అవుతుందని హెచ్చరించారు. జూదంలో ఆర్థిక నష్టాలే మిగులుతాయని, ఇది కుటుంబ సమస్యలకు దారితీస్తుందని పేర్కొన్నారు. యువత, ప్రజలు పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్య, ఉపాధి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సానుకూల మార్గాలపై దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను సాధించడం ద్వారా కుటుంబాలకు గర్వకారణంగా నిలవాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని, జూదం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.