శ్రీ శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు: మహర్నవమి వేడుకల్లో మహిషాసుర మర్దినిగా కామారెడ్డి శారదాంబ దర్శనం
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
శ్రీ శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు: మహర్నవమి వేడుకల్లో మహిషాసుర మర్దినిగా కామారెడ్డి శారదాంబ దర్శనం
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి
శ్రీ శారదా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మహర్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, కామారెడ్డి శారదాంబ జగన్మాత నేడు మహిషాసుర మర్దిని, మహంకాళి అవతారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. లోకకంటకులైన దుష్టులను, మహిషాసురాది రాక్షసులను సంహరించి లోకానికి పట్టిన పీడలను తొలగించిన ఆ జగన్మాత... నేడు సమస్త భక్త కోటిని పట్టిపీడిస్తున్న సర్వ సంక్షోభాలు, ప్రకృతి విపత్తులు, సంకటాలు, బాధలను కష్టాలను పూర్తిగా తొలగించి, సర్వజనులకు సంపూర్ణ ఉపశమనాన్ని, శాంతిసౌభాగ్యాలను ప్రసాదించాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. మహర్నవమి వేడుకల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు. ఆలయమంతా "శ్రీమాత్రే నమః" నామస్మరణతో మార్మోగింది.