నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై పోలీసుల కొరడా
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై పోలీసుల కొరడా
-
కామారెడ్డి పట్టణంలో ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు
-
106 కేసులు నమోదు.. రూ.1,30,770 జరిమానా వసూలు
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి టౌన్
నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కామారెడ్డి పోలీసులు కొరడా ఝుళిపించారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు లేకుండా తిరగడం, అంకెలను చెరిపివేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న వాహనాలను గుర్తించి తనిఖీలు చేపట్టారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వివిధ ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా మొత్తం 106 కేసులు నమోదు చేసి, 241 చలాన్లు జారీ చేశామని, రూ.1,30,770 జరిమానా విధించినట్లు పోలీసులు వెల్లడించారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో కామారెడ్డి పట్టణ ఎస్హెచ్ఓ నరహరి, ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.