గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి: ఐరేని సందీప్..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై వ్యక్తిగత విమర్శలు సహించబోం.. గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి: ఐరేని సందీప్..
పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డిసిప్లీనరీ కమిషన్ చైర్మన్ మల్లు రవిలకు కామారెడ్డి కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదు..
పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా చంద్రశేఖర్ రెడ్డి వైఖరి...
అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్‌లో కొనసాగింపు.. ఆధారాలతో కూడిన వీడియోల సమర్పణ...
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి / హైదరాబాద్:
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, సీనియర్ నాయకులపై పబ్లిక్‌గా వ్యక్తిగత విమర్శలు చేస్తున్న టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై తక్షణమే కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకొని, పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు ఐరేని సందీప్ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేయగా, వారి సూచనల మేరకు శనివారం డిసిప్లీనరీ కమిషన్ చైర్మన్ మల్లు రవి కి అధికారికంగా ఫిర్యాదు లేఖను, చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల వీడియో ఆధారాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఐరేని సందీప్ మాట్లాడుతూ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో గత నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, వేలాది మంది కార్యకర్తలకు మార్గదర్శకులుగా నిలిచిన రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పై గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలు పార్టీ శ్రేణుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. "చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వాడిన పదజాలం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత గౌరవాన్ని తగ్గించే విధంగా ఉంది. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే వాడిన భాషను తను కూడా వాడుతూ, బీజేపీని సమర్థిస్తున్నట్టుగా మాట్లాడటం ఆయన క్రమశిక్షణారాహిత్యానికి నిదర్శనం. గతంలో ఇతర పార్టీల్లో కూడా ఇలాంటి వివాదాస్పద వైఖరి వల్లే సస్పెండ్ అయిన ఈయన, ఇప్పుడు కాంగ్రెస్‌లో కూడా అదే ధోరణిని కొనసాగించడం తీవ్ర ఆందోళనకరం."ఐరేని సందీప్... అక్రమాల రక్షణ కోసమే పార్టీలో చేరిక: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గత చరిత్ర మొత్తం అక్రమాలు, భూకబ్జాలు, బెదిరింపులు, పేలుడు పదార్థాల వ్యాపారాలు మరియు 420 కేసులతో నిండి ఉందని సందీప్ ఆరోపించారు. గతంలో మున్సిపల్ చైర్మన్ భర్తగా ఉండి, మున్సిపాలిటీ పాత సామాన్లు దొంగతనంగా అమ్ముకున్న కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. తన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, ఆత్మరక్షణ కోసమే ఆయన కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నారు తప్ప, పార్టీ శ్రేయస్సు కోసం కాదని మండిపడ్డారు.ఇలాంటి చర్యలు కార్యకర్తల్లో అయోమయాన్ని సృష్టిస్తూ, ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరుస్తున్నాయని.. పార్టీ గౌరవాన్ని, కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని కాపాడేందుకు కామారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండల, పట్టణ అధ్యక్షులు మరియు పార్టీ శ్రేణుల తరఫున చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పీసీసీ నాయకత్వాన్ని గట్టిగా కోరారు. ఒకవేళ ఇప్పుడైనా చర్యలు తీసుకోకపోతే నియోజకవర్గంలో పార్టీ మనుగడకే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు.