© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదు: జిల్లా ఎస్పీ..
19 మంది నిందితుల అరెస్ట్, భారీ పోలీస్ ఫ్లాగ్ మార్చ్...
కామారెడ్డి: బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించి శాంతిభద్రతలను పునరుద్ధరించింది. జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఐపిఎస్ పర్యవేక్షణలో కేవలం మూడు గంటల్లోనే పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పట్టణంలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది.
*అరెస్టులు: సీసీటీవీ ఫుటేజ్ మరియు సోషల్ మీడియా ఆధారంగా 42 మందిని గుర్తించగా, ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేయడం జరిగింది. మిగిలిన వారందరినీ త్వరలోనే చట్టం ముందు హాజరుపరుస్తాము.
*కఠిన నిఘా: ఈ ఘర్షణల్లో పాల్గొన్న వారందరిపై కమ్యూనల్ సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి, భవిష్యత్తులో వారిపై కఠిన నిఘా కొనసాగిస్తాము.
*భారీ ఫ్లాగ్ మార్చ్: ప్రజల్లో భద్రతాభావాన్ని నింపడానికి ఎస్పీ ఆధ్వర్యంలో 120 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో పట్టణంలోని ప్రధాన వీధుల్లో 6 కిలోమీటర్ల మేర భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించబడింది.
ఎస్పీ హెచ్చరిక:"చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదు. సోషల్ మీడియా ద్వారా వదంతులు వ్యాప్తి చేసే వారిపై, అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాము."
*మల్టీ-డిస్ట్రిక్ట్ కేసులు: ఈ ఘటనకు సంబంధించి నిజామాబాద్, నస్రుల్లాబాద్ మరియు సంగారెడ్డిలలో కూడా ఎఫ్ఐఆర్లు (FIRs) నమోదు చేసి విచారణ వేగవంతం చేశాము.
ప్రజలకు విజ్ఞప్తి: ప్రజలెవరూ వదంతులను నమ్మవద్దు.ఆస్తి నష్టం జరిగిన బాధితులు నిర్భయంగా వచ్చి ఫిర్యాదు చేయాలి. శాంతిని కాపాడటంలో పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలి.ఈ కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి,ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు,ఎస్సైలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి • సుమారు 7 గంటల క్రితం7
కామారెడ్డి • సుమారు 15 గంటల క్రితం24
కామారెడ్డి • 11 రోజుల క్రితం12
కామారెడ్డి • ఒక రోజు క్రితం39
కామారెడ్డి • 2 రోజుల క్రితం23