బిక్నూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెంకటేష్ ప్రమాణ స్వీకారం...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
బిక్నూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెంకటేష్ ప్రమాణ స్వీకారం...
ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ...
ఘనంగా జరిగిన మండల కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం....
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి....
బిక్నూర్ మండల యూత్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా వెంకటేష్ మరియు మండల కార్యవర్గ సభ్యులు సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి ప్రముఖ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.జిల్లా నాయకత్వం: కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి.మున్సిపల్ & పార్టీ ప్రతినిధులు: పిసిసి జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఉమారాణి శ్రీనివాస్, మాజీ డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాస్. పోసానిపేట గ్రామ మాజీ సర్పంచ్ మరియు రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన కామారెడ్డి జిల్లా కన్వీనర్ గీరెడ్డి మహేందర్ రెడ్డి.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యువత పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ పథకాలను గడపగడపకూ చేరవేయాలని నూతన కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు.నూతన అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మండలంలో పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, సర్పంచులు, మాజీ సర్పంచులు,మాజీ ఎంపిటిసిలు మరియు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.