భిక్కనూరులో ఘనంగా మహంకాళి అమ్మవారి తొట్టెల కార్యక్రమం..
భిక్కనూరులో అంగరంగ వైభవంగా మహంకాళి అమ్మవారి తొట్టెల కార్యక్రమం..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:భిక్కనూరు..
ఆషాడ మాసం సందర్భంగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో భిక్కనూరు యూత్ ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి తొట్టెల కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా యూత్ సభ్యులు సంప్రదాయబద్ధంగా తొట్టెలలను సిద్ధం చేసి, గ్రామ ప్రధాన వీధుల గుండా మంగళవాయిద్యాలతో డప్పు చప్పుళ్ల మధ్య కోలాహలంగా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం తొట్టెలలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి యూత్ సభ్యుడు యోగేష్ ముందుండి నాయకత్వం వహించి ఏర్పాట్లను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. ఆషాడ మాసంలో అమ్మవారికి తొట్టెల కార్యక్రమం ఏర్పాటు చేసి సమర్పించడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. భిక్కనూరు యూత్ సభ్యులతో పాటు గ్రామ ప్రజలందరినీ మహంకాళి అమ్మవారు చల్లగా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరిపై అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని వారు మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు యూత్ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.